టీడీపీ అధికారంలోకొస్తే అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉంటాయి: వల్లభనేని వంశీ
- ఈ ఐదేళ్లు ప్రజల కోసం మేము పని చేశాం
- టీడీపీ మళ్లీ వస్తే సామాజిక సమతుల్యం ఉంటుంది
- వైసీపీ వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది
టీడీపీ అధికారంలో కొస్తే అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉంటాయని, ఏ పని చేసుకునే వాళ్లు ఆ పని చేసుకుంటూ సంతోషంగా జీవిస్తారని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ‘టీవీ 9’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వస్తే సామాజిక సమతుల్యత ఉంటుందని అన్నారు. వైసీపీ లాంటి పార్టీలు అధికారంలోకి వస్తే సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో కూడా వైసీపీనీ ప్రజలు తిరస్కరించడానికి కారణం ఇదే అని అన్నారు. ఈ ఐదేళ్లు ప్రజల కోసం తాము పని చేశామని, టీడీపీని ప్రజలు ఆదరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ యత్నించిందని, డబ్బు విచ్చల విడిగా ఖర్చు చేసిందని, ఎన్నికల సంఘం మద్దతు ఆ పార్టీకి ఉందని ఆరోపించారు.